నిజామాబాద్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకితభావంతో చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా హరిదా రచయితల సంఘం తమను గౌరవించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు.
రచయితలు అంటే ప్రజలలో ధైర్యాన్ని తమ రచనల ద్వారా నింపుతారని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం డాక్టర్ ప్రతిమారాజ్‌ను హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, అధికార ప్రతినిధి నరాల సుధాకర్, కొయ్యడ శంకర్ తదితరులు సన్మానించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలను అందిస్తున్న జిల్లా డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.