కామారెడ్డి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కొరెల్లి గంగమణి (35) జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న పత్తి రవికుమార్ ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.
గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో దోమకొండ నుంచి వచ్చి రక్తదానం చేయడం జరిగిందని అభినందనీయమని యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మీడియా సెల్ కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, టెక్నీషియన్లు చందన్ పాల్గొన్నారు.