26 నుంచి ఉచిత ఐబీపీఎస్‌ శిక్షణ

హైదరాబాద్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఐబీపీఎస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టీనా తెలిపారు.

ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మందికి శిక్షణ ఇస్తామని, ఎస్టీలకు 72, ఎస్సీలకు 15, బీసీలకు 10, దివ్యాంగులకు మూడు సీట్లు ఉంటాయని వివరించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »