హైదరాబాద్, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ నెలలో మూసివేసిన రవీంద్రభారతి ఆడిటోరియంను గురువారం (జూలై 1) న పునఃప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్క ృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాలను, నిబంధనలను పాటిస్తూ ఇకనుంచి అన్ని సాంస్క ృతిక కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అన్ని చర్యలు తీసుకున్నప్పటికి వీక్షకుల సహకారం చాలా అవసరమన్నారు. కరోనా నిబంధనలతోపాటు అధికారులకు సహకరించాలని కోరారు.