బోధన్, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నారాని అన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొర్రోల్ల కృష్ణ, తెరాస నాయకులు సుర్యకాంత్, బోధన్ కన్వీనర్ మీర్జాపురం బాలరాజు, తాటి భూమయ్య, సంజీవ్, మధు, మల్లయ్య, నాగభూషణం, తెరాస ఎస్సి సెల్ అధ్యక్షులు అడ్లూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.