కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సవిత అనే మహిళకు ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన కవిత మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ మహిళలు రక్త దానానికి ముందుకు రావడం చాలా అభినందనీయం, స్ఫూర్తిదాయకమని రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాత కవితను అభినందించారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.