కామారెడ్డి, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్ పూర్తి అయ్యేవిధంగా సహకరించడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో గర్భిణీ స్తీల కోసం ఫోన్ చేయగానే స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత శ్రీధర్ గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో రాజు, రవీందర్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.