డిచ్‌పల్లి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం మార్చి నెలలో 23 వ తేదీ నుంచి ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు కొవిద్ -19 సెకండ్ వేవ్ విస్తృతం అయినందున తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ లాక్ డౌన్ విధిస్తూ అకస్మాత్తుగా వాయిదా వేసిన విషయం విదితమే. తిరిగి ఈ పరీక్షలను ఈ నెల 19 నుంచి పున:ప్రారంభం చేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో 8, ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలో 6 మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాన్రు. విద్యార్థులు తమ సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియను త్వరలోనే వెబ్ సైట్‌లో సూచించనున్నట్లు ఆయన వివరించారు.