కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన తహసీల్దార్ నర్సింలును అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నర్సింలు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
రైతుల సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదని, తెలంగాణ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చిందని ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం అవుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో కూడా ధరణి యాప్ ద్వారా ఫోన్‌లో కూడా భూమి వివరాలు చూసుకోవచ్చని అన్నారు. త్వరలోనే పాత పెండిరగ్ భూముల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
రైతులు రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అన్నారు. బిక్నూర్ మండలం రైతులకు రెవెన్యూ పరంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు అంకం శ్యామ్ రావు, మోతే లావణ్య, నాగరాజు, యాదమ్మ, షేక్ దావూద్, రాజిరెడ్డి, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.