మోర్తాడ్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం లోని దోనుపాల్ గ్రామానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జూలై 6 మంగళవారం విచ్చేస్తున్నట్టు మోర్తాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం తెలిపారు.
దోనుపాల్ గ్రామంలో నిర్మించిన 33 /11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.