కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారి 44 కు ఇరువైపుల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 10 వ తేది వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అటవి, మున్సిపల్, పంచాయతీ అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి టీ గార్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
కూలీలకు మొక్కలు నాటే విధానంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని కోరారు. పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. గ్రామ పంచాయతీల వారీగా జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. మునిసిపల్, అటవీశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఇన్చార్జి డిఎఫ్‌వో సునీల్, డిపిఓ సునంద, ఉపాధి హామీ ఏపీడిలు శ్రీకాంత్, సాయన్న, అటవీశాఖ అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.