నిజామాబాద్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, బి.పి.యస్.,, అనితా రాజేంద్ర, సెక్రేటరి, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, డా. వి. లక్ష్మారెడ్డి, సంచాలకులు డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ బక్రీద్ పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించినట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాబోవు రోజులలో బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోవుల అక్రమ రవాణా గోవధను నివారించేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, సంతలో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశువైధ్యాధికారిచే ఆరోగ్య, రవాణాకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, ఇట్టి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా వాహానాదారునితో పాటుగా కలిగి ఉండాలని సూచించారు.
గోవుల రవాణా జరిగే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉండాలని అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే సాకుతో బృందాలుగా ఏర్పడి అల్లర్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో మత పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పశు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా మున్సిపాలిటి లేదా గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికులను కో-ఆర్డినేటు చేసుకుంటూ వాటిని శుభ్రపరిచే విధంగా చూడాలని, పోలీస్, పశు సంవర్ధక శాఖ విభాగాలు సంయుక్తంగా విధులు నిర్వహించాలని అన్నారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా గోవుల అక్రమ రవాణ కొరకు నిజామాబాద్ వ్యాప్తంగా 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది.
విడియో కాన్ఫరెన్సులో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా, జిల్లా పశువైద్యాధికారి అధికారి డా. ఎమ్. భరత్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, అదనపు డి.సి.పి. జి. శ్రీనివాస్ కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పిలు ఎ. వెంకటేశ్వర్లు, రఘు, రామారావ్, అసిస్టెంట్ డైరెక్టర్ పశు సంవర్ధక శాఖ అధికారి ఎమ్.చి హైమద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్లు రాఘవేందర్, ప్రసాద్ తదితరులున్నారు.