నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు సంఘసంస్కర్త, భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ బీహార్‌లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చాడని భారత పార్లమెంట్‌లో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారతదేశ ఉప ప్రధానిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రతి ఒక్కరు బాబు జగ్జీవన్ రామ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు మటం విజయ్ కుమార్, భాస్కర్, సాయిలు, రవీందర్, సంతోష్, రవి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.