డిచ్‌పల్లి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు అలాగే ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10 -12 గంటల వరకు డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 9730 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 8676 మంది హాజరు, 1054 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
అలాగే ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 35 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 31 మంది హాజరు, 4 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం 2-4 గంటల వరకు డిగ్రీ ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 6365 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5792 మంది హాజరు, 573 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
రిజిస్ట్రార్ ఆచార్య నసిం నిజమాబాద్ లోని మహిళా, సిఎస్‌ఐ, నిశిత కళాశాలలను సందర్శించగా తాను గురుకుల డిగ్రీ, విశ్వశాంతి, నలంద, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలను పర్యవేక్షించినట్లు కంట్రోలర్ పేర్కొన్నారు. ఏ పరీక్షా కేంద్రంలో కూడా మాల్ ప్రాక్టిస్ కేసులు రికార్డ్ కాలేదని వివరించారు.