గ్రామాల రూపురేఖలు మార్చడానికే హరితహారం

నందిపేట్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో గ్రామల రూపురేఖలు మార్చుకునే లక్ష్యంతో పల్లె ప్రగతి – హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఏడో విడత హరితహారం – పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో మంగళవారం పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమములో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎల్‌ఏ మాట్లాడుతూ గతంలో గ్రామాలలో పరిశుభ్రత అస్తవ్యస్తంగా వుండే విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్నారని కితాబిచ్చారు. గ్రామ సమస్యలు వెంట వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు నిర్మించామన్నారు.

మండలంలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్న తీరును అధికారుల, ప్రజా ప్రతినిధుల ద్వార తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలను నాటడం కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నిధులతో లక్కంపల్లిలో ఇటీవల నిర్మించిన మాదిగ సంఘం (10 లక్షల నిధులు) మాల సంఘ భవనం (12.50) లక్షలు మహిళా భవన్‌ (రెండున్నర లక్షల) లను సందర్శించి పరిశీలించారు.

కుల సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాల శాలువాతో సత్కరించారు. కురుమ కులస్తులు నిర్మించిన భవనాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. భవనానికి 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో గల బీరప్ప మందిరానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి ఎండార్స్మెంట్‌ ద్వార నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. లక్కంపల్లి నుండి సిహెచ్‌ కొండూరు కొరకు లింక్‌ రోడ్‌ అలాగే లక్కంపల్లి నుండి బజార్‌ కొత్తూరు లింక్‌ రోడ్‌ చేయిస్తామని గ్రామ సర్పంచ్‌ కోరిక మేరకు హామీ ఇచ్చారు మహిళ సర్పంచ్‌ ఉన్నప్పటికీ లక్కంపల్లి గ్రామన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్తున్నారని సుమలతను ప్రశంసించారు.

సర్పంచ్‌ సుమలత మహీందర్‌ సొంత ఖర్చులతో గ్రామ ప్రజల అవసర నిమిత్తం స్వర్గ రథం, గ్రామ కమాన్‌, బతుకమ్మ ఘాట్‌ నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల అభినందించారు. గ్రామానికి వచ్చిన ఎంఎల్‌ఏకు ప్రజలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గ్రామం మొత్తం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొన్నారు. కుల సంఘ సభ్యులు ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డితో పాటు ఎంపిపి వాకిడి సంతోష్‌కు పూలమాల శాలువలతో సత్కరించారు.

కార్యక్రమంలో ఎంపిపి వాకిడి సంతోష్‌, వైస్‌ ఎంపిపి దేవేందర్‌, లక్కంపల్లి సర్పంచ్‌ మూఢ సుమలత మహేందర్‌, ఎంపిటిసి శ్రీనివాస్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మార్వో, ఎండిఓ, ఎస్‌ఐ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »