డిచ్‌పల్లి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎల్‌ఎల్‌బి విద్యార్థులకు సోమ, మంగళవారం (రెండు రోజులు) వర్చువల్ వేదికగా వైవా వోస్ ( మౌఖిక పరీక్ష) నిర్వహించినట్లు విభాగాధిపతి డా. బి. స్రవంతి తెలిపారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్ రిసల్యూషన్’’ అనే అంశంపై వైవా వోస్ నిర్వహించగా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా డా. జె. ఎల్లోసా, ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా డా. ఎం. నాగజ్యోతి వ్యవహరించారు.
రెండవ రోజు ‘‘ప్రొఫెషనల్ ఎథిక్స్’’ అనే అంశంపై వైవా వోస్ నిర్వహించగా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా అడ్వకేట్ డా. రమేష్ బాబు, డా. ఎం. నాగ జ్యోతి, ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా డా. జె. ఎల్లోసా వ్యవహరించారు. వైవా వోస్‌లో 22 మంది పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.