డిచ్‌పల్లి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని ఉపకులపతులతో, బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పాల్గొన్నారు.
బ్రిటీష్ కౌన్సిల్, యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో అకడమిక్ వ్యవహారాలు, పరిశోధనా అవకాశాలు, విద్యార్థుల బదలాయింపులకు అనువుగా కలిసికట్టుగా పని చేయడానికి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి ఎంఓయూ ఒప్పదం కుదుర్చుకున్నట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉన్నత విద్యా, పరిశోధనలకు మంచి అవకాశం కలుగనున్నదని వీసీ అన్నారు. బ్రిటీష్ కౌన్సిల్ ఒప్పందానికి అన్ని యూనివర్సిటీల వీసీలు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.