19 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌/ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయన్నారు.

కాగా పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సెమిస్టర్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఒకదాని వెంట ఒకటి విడుదల అయినందు వల్ల విద్యార్థులు ఏ మాత్రం అయోమయానికి గురి గాకుండా ఉండడం కోసం రెండు సెమిస్టర్స్‌ పరీక్షలను ఒకే హాల్‌ టికెట్‌ మీద, ఒకే పరీక్షా కేంద్రంలో రాసే వెసలుబాటు కల్పించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో 8, ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలో 6 మొత్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియను త్వరలోనే వెబ్‌ సైట్‌ లో ఉంచనున్నట్లు ఆయన వివరించారు.

పరీక్షా కేంద్రాలలో కొవిద్‌ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. అర్థగంట ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరు కావాలని ఆజ్ఞాపించారు. ఆలస్యమైన విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్షాకేంద్రంలోకి ప్రవేశం కల్పించబోమని పేర్కొన్నారు.

కావున పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాల కోసం యూనివర్సిటి వెబ్‌ సైట్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »