వేల్పూర్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జమున అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఒంటి గంట తర్వాత ప్రారంభం కావడంతో పలువురు ఎంపిటిసిలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీపీ జగన్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని, అధికారులు ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలని చెబుతున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంక్సాపూర్ ఎంపీటీసీ గంగారెడ్డి అధికారులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని నిలిపివేయాలని ఎంపీపీని కోరడంతో ముగించేశారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశంలో అధికారులు హాజరు కాకపోవడం ఎంత వరకు సమంజసమని హాజరుకాని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్, తహసిల్దార్ సతీష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేష్, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.