కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఎల్లవ్వ (50) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డికి చెందిన నాగసాయి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ వేద ప్రకాష్, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.