డిచ్‌పల్లి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగంలో ప్రాజెక్ట్ నివేదిక రూప కల్పనపై అంతర్జాల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డా. రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్ కోసం నిత్య జీవితంలో సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రాజెక్ట్‌గా ఎంచుకోవాలని, ఎంచుకునే సమయంలో పరిగణలోకి అంశాలను సూచించారు.
అనంతరం వాణిజ్య శాస్త్ర విభాగం డీన్, ప్రొఫెసర్. యం. యాదగిరి ప్రాజెక్ట్ నివేదిక తయారు చేసే విధానాన్ని అందులో ఉండే అంశాలను విద్యార్థులకు వివరించారు. చివరగా డా. జి. శ్రీనివాస్ ప్రాజెక్ట్ కోసం డేటా సేకరించే విధానాన్ని డేటా సేకరణ టూల్స్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు ఎన్ .శ్వేతా, విభాగ సిబ్బంధి ఓ. రాజు, తెలంగాణ రాష్ట్రము నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి 350 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.