వేల్పూర్, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగి సందర్శించారు. వేల్పూర్ మండలకేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాత్రి రోడ్లు, భవనాలశాఖ మంత్రి ఇంట్లో పల్లె నిద్ర చేశారు. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదిక సందర్శించారు.
ప్రత్యేక అతిథులుగా చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్, దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా పంచాయతీరాజ్ మంత్రిని కలిశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం మంత్రులు గ్రామంలోని కిరాణా షాపు ముందుచెత్త ఉండడాన్ని చూసి షాప్ ఓనర్‌కు 100 రూపాయలు ఫైన్ వేశారు. ప్రజలకు, షాపు యజమానుల అవగాహన కోసమే ఫైన్ వేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
గురువారం ఉదయం తెరాస జడ్పీటీసీలు, ఎం.పీ.పీలు మంత్రి దయాకర్ రావును శాలువాతో సన్మానించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు మంత్రి ఎదుట హాజరయ్యారు. మంత్రి దయాకర్ స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో తెరాస నాయకులు, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.