నందిపేట్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో 7 వ విడత పల్లె ప్రగతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ వెల్లడిరచారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ చౌరస్తా, కమాన్ ప్రక్కన గల మురికి కాల్వలను శుభ్ర పరిచారు. ప్రధాన రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే పనులను కార్యదర్శి సాయి కుమార్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె ప్రగతి పనులలో చురుకుగా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. నందిపేట్ గ్రామం పెద్దగా ఉండడం వలన ఎన్నో పనులు చేసినప్పటికీ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వెల్లడిరచారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని తమ ఇండ్ల వద్ద స్వచ్చత పాటించాలని కోరారు.