నందిపేట్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బాలో గల పురాతన రహమానియా మజీద్ పునర్నిర్మాణము కొరకు దాతలు అందరూ సహృదయంతో ముందుకొచ్చి సహకారం అందించాలని రహమానియా మజీద్ అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. ఇప్పటివరకు దాతల సహకారంతో 8 లక్షల వరకు ఖర్చు చేసి పిల్లర్స్ వరకు పని పూర్తి చేశామన్నారు.
మస్జిద్ శిథిలావస్థకు వచ్చినందున కాలనీ వాసులందరి అభిప్రాయం మేరకు పునర్ నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా కాలోనిలో పేద మధ్యతరగతి ప్రజలు ఉండడం చేత మస్జిద్ నిర్మాణానికి ఆర్థిక సమస్య తలెత్తుతుంది. ఇంకా 15 లక్షల రూపాయల పని ఉందన్నారు. కావున దాతలు సహకరించాలని కోరారు.