వేల్పూర్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పలు కాలనీలలో మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. హరిత కోమన్పల్లి గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.
గ్రామంలో అన్ని కాలనీలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ పాఠశాలలో, చెరువు కట్టలు, రోడ్లపై, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసయ్య, వివో అధ్యక్షురాలు నర్సు, గ్రామ కార్యదర్శి సురేష్, మండల మహిళా సమాఖ్య సిసి ప్రవీణ్, వివో ఏ సుభాష్, గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.