వేల్పూర్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకపాలన, రైతు సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని, అభివృద్ధిని చూసి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీని నమ్మి వచ్చిన వారికి తప్పకుండా అండగా ఉంటామని తెలిపారు. వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరిన వారిలో రాము, క్రాంతి, సాగర్, ఎర్రన్న, శ్రీనివాస్, రజినీకాంత్, గంగాధర్, కిషన్, కె.చిట్టి, సాయిలు, సురేష్ తదితరులున్నారు.