నందిపేట్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డిని నందిపేట్ టిఆర్ఎస్ నాయకులు కోరారు. నాయకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు.
వివిధ గ్రామాల మధ్య లింక్ రోడ్డులను చేపట్టాలని కోరారు. అదేవిధంగా నందిపేట గ్రామంలోని ఆర్మూర్ బైపాస్ రోడ్డును పంచాయతీరాజ్ నుండి ఆర్ అండ్ బి డిపార్టుమెంట్‌కు మార్చి అందులో, మెయిన్ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, నందిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో, పోలీస్ స్టేషన్ ఆవరణలో సీసీ కాంక్రీట్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్ అండ్ బి అధికారులకు, ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎర్రం ముత్యం, నందిపేట మండల పద్మశాలి అధ్యక్షులు మాన్ పూర్ భూమేష్, మచర్ల సాగర్ ఉన్నారు.