వేల్పూర్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ధనలక్ష్మి గ్రామ సంఘం మహిళా సంఘాలతో నెలసరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ నరసయ్య మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్య అధికారిగా మండల మహిళా సంఘాలకు ఎపిఎం రఘురాం చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఎపిఎం మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ సంఘం రికార్డులను పరిశీలించారు.