నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు ఎంతో కష్టపడి భారతదేశ కీర్తి పతాకాలను ఎగర వేస్తారని పలువురు కొనియాడారు. నిజామాబాద్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ చర్మ వైద్య నిపుణులు రేవంత్ దాదాపు 25 మంది బాక్సింగ్ క్రీడాకారులకు ట్రాక్ సూట్‌లను అందించారు. క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే దేశ సేవతో సమానం అని వక్తలు డాక్టర్ రేవంత్‌ని అభినందించారు.
అదేవిధంగా నిస్వార్ధంగా కొన్ని సంవత్సరాల నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తున్న సంశమోద్దిన్‌ని కూడా ఈ సందర్భంగా పలువురు అభినందించారు. నిజామాబాద్ అమెచుర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాల్ భవన్ కాన్ఫరెన్సు హాల్లో అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారులు హుసామొద్దిన్‌ను సత్కరించడంతో పాటు బాక్సింగ్ క్రీడాకారులకు దాదాపు 25 మందికి ట్రాక్ సూట్‌లు అందించారు. అలాగే ఇటీవల మృతి చెందిన హ్యాండ్ బాల్ సెక్రెటరీ అన్వర్‌కి, కబడ్డీ జాయింట్ సెక్రెటరీ కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శంకర్‌కి నివాళులు అర్పించారు.
కార్యక్రమానికి అతిథులుగ మాజీ డిప్యూటీ డిప్యూటీ మేయర్ ఫాహీం, నిజామాబాద్ అమేచూర్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు అక్బరొద్దిన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆంద్యాల లింగం, బాక్సింగ్ కోచ్ శంశమొద్దిన్, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఫయాజొద్దిన్, మాజీ కార్పొరేటర్ నవీద్ ఇక్బాల్, కబడ్డీ కోచ్ ప్రశాంత్, పాపా ఖాన్, సైకిల్ పోలో కార్యదర్శి జనార్ధన్, ఆబిద్ హుస్సేన్, అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారులు ఎత్తేషాం, పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.