నిజామాబాద్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో 10 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమలు చేయడం జరిగిందని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని 17 వ వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. వార్డుకు స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన ఇర్ఫాన్ పలు సమస్యలను సర్వే నిర్వహించారు.
అందులో సిసి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, అంగన్వాడీ భవనం మొదలగు సమస్యలను గుర్తించడం జరిగిందని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గత పది రోజులుగా నిర్వహించిన అభివృద్ధి పనుల గురించి చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించారు.
అలాగే ఇంత కరోన సమయంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు గుర్తించి చిరు కానుకలు ఇచ్చి సన్మానం చేశారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అవధూత నరేందర్, పట్టణ ప్రగతి ఇన్చార్జ్ కిషన్, ఆర్‌పి రమ్య, అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ సావిత్రి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.