కామారెడ్డి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మున్సిపల్ అధికారులు పంపిణీ చేశారని, వాటిని ప్రజలు నాటుకొని సంరక్షణ చేస్తే పట్టణాలు నందన వనాలుగా మారుతాయని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 8, 32 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షణ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, ఆర్డీవో శీను, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.