నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో సంస్కృత భాషను రెండో భాషగా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) బృందం జిల్లా ఇంటర్ విద్యాధికారి (డి.ఐ.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ సంస్క ృతాన్ని రెండో భాషగా ఇంటర్ బోర్డు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది తెలుగు భాషకు తీవ్ర నష్టకరమన్నారు. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్, 35 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయన్నారు. ఫస్టియర్‌లో 95 వేల మంది విద్యార్థులు వీటిల్లో చదువుతున్నారన్నారు. వీరిలో 80శాతం పైగా విద్యార్థులు తెలుగు సబ్జెక్టును రెండో భాషగా చదువుతున్నారన్నారు.
కేవలం పెద్దస్థాయి ప్రయివేటు, కార్పొరేటు కాలేజీల్లో మార్కుల కోసం మాత్రమే సంస్క ృతం తీసుకుంటారన్నారు. సంస్క ృత భాష నిజజీవితంలో గానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోగానీ ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. ఇంటర్ బోర్డు నిర్ణయంతో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేయడమేనన్నారు. అదేవిధంగా పీజీలో తెలుగు చదివి ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్ బోర్డు నిర్ణయం శరాఘాతం అన్నారు.
ఒకవైపు ప్రభుత్వం తెలుగు భాషను తప్పనిసరని చట్టాలు చేసి, మరోవైపు సంస్క ృతాన్ని ప్రోత్సహించడం పరస్పర విరుద్ధ చర్యలన్నారు. వెంటనే ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్, అశుర్, సాయితేజ, రమేష్ చారి పాల్గొన్నారు.