నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ మొట్టమొదటి పీ.ఆర్.సి. కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినందున వెంటనే వాటిపై సవరించిన జీవోలను జారీ చేయాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారము నలంద హైస్కూల్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రి మాట్లాడారు.
20 సంవత్సరాల సర్వీసుకు పూర్తి పెన్షన్‌కు అర్హత గురించి, జులై 2018 నుండి పిఆర్సి బకాయిలను చెల్లించాలని, గ్రాట్యుటీ తదితర ఆర్థిక పరమైన అంశాలను జూలై 2018 నుండి రిటైర్డ్ ఉద్యోగులకు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 61 సంవత్సరాల వయోపరిమతిని జులై 2018 నుండి పరిగణలోకి తీసుకోవాలని, వెల్నెస్ సెంటర్ నందు మందులు, డాక్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చి ఈ. హెచ్. ఎస్. స్కీమ్‌ను పటిష్ట పరిచి మెరుగైన వైద్యం అందించాలని, రిటైర్డు ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌తో సహా అన్ని హాస్పిటల్స్‌లో అమలు చేయాలని జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంమోహన్ రావు, జిల్లా నాయకులు మేరీ, షహీద్ మియ, జార్జ్, నరసింహస్వామి, పోచద్రి, మురళీకృష్ణ, బేబి, బట్టి గంగాధర్, సిర్ప లింగం, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.