కామారెడ్డి, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త ఆకుల బాబా గౌడ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించగా ఆయన భార్య జ్యోతికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా సొమ్ము 2 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించలేదని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణన్న, ఎంపీపీ అధ్యక్షుడు పిప్పిరి అంజన్న, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.