ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో పిల్లి భూలక్ష్మి (30) కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మెట్టు స్వామి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మహిళ కోసం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు లింబాద్రి, సురేష్‌ రెడ్డి, పిల్లి యాదగిరి, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »