వేల్పూర్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలకు ట్రీ గార్డులను ఉచితంగా అందించిన దాతలకు పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు గ్రామ సర్పంచ్ వర్షిని రాజ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని సుందరీకరణ చేసినట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డులలో రోడ్డుకిరువైపులా చెరువులకు ఇరువైపులా రోడ్డు పక్కలకు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.