వేల్పూర్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూరు మండల కేంద్రంలో తన నివాసంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తన సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ అమలు పరిచిన పథకాలు ప్రజల్లో పూర్తిస్థాయిలో తీసుకు వెళ్లి వివరించాలని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలిపారు.