14న దిశ సమావేశం

కామారెడ్డి, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ సభ్యులు బీబీ పాటిల్‌ ఆధ్వర్యంలో 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశము నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డి.వెంకట మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ సమీక్షా సమావేశానికి రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, జుక్కల్‌ శాసన సభ్యులు హనుమంత్‌ షిండే, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్‌, జిల్లా అధికారులు, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు హాజరవుతారని ఆయన ప్రకటనలో తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »