కామారెడ్డి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ షాహిద్ ఆలీకి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం నుండి నేటి వరకు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టడానికి రామారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలు తరచూ మెడికల్ ఆఫీసర్ షాహిద్ అలీ పర్యవేక్షిస్తూ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై నిత్యం ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారని అన్నారు. వైద్యులు భగవంతుడితో సమానమని అమ్మ మనకు జన్మనిస్తే వైద్యులు మనకు పునర్జన్మ ఇస్తారన్నారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ షాహిద్ ఆలీ మాట్లాడుతూ ప్రస్తుతము లాక్ డౌన్ ఎత్తి వేశారని ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. 18 సంవత్సరాలు పైబడినవారు ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకోవాలని అన్నారు. ప్రజలు బలమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవాలని రెండు మాస్కులు ధరించాలని, విందులు వినోదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని అన్నారు. చిన్నపిల్లలకు మంచి బలమైన ఆహారం ఇవ్వాలని బయటకు రానివ్వద్దన్నారు. రామారెడ్డి మండల ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎల్లవేళల అందుబాటులో ఉంటామని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్చందంగా నిర్వహిస్తు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ షాహిద్ అలీ, సమాచార హక్కు చట్టం ప్రతినిధులు లక్కాకుల నరేష్, భవాని పేట సుమన్, భవాని పేట నితిన్, నేరెళ్ల నవీన్, ఆస్పత్రి సిబ్బంది ఎంబీ భీమ్, హెచ్ ఈ.పవన్, ఎల్‌టి. శ్రీహరి, ఆయుపి స్వాతి ,ఫార్మసి స్టాప్ రజిత, స్టాఫ్ నర్స్ శ్రీధర్ ,ఆయుష్ మహేశ్వరి, గంగామణి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.