నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా పల్లే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగపల్లి గ్రామంలో దాదాపు 40 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి ముందు రావడం హర్షణీయం అని, ప్రకృతి సేద్యం, గో ఆదారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామరావు అన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారన్నారు. ఇప్పుడు మాపల్లె ద్వారా మన పూర్వీకుల వంగడాలను సేద్యం చెయ్యడం శుభ పరిణామం అన్నారు.
మన పూర్వీకుల వంగడాలను స్వయంగా బ్రహ్మచే అందించడం జరిగిందని అన్నారు. విమలక్క మాట్లాడుతు ఈ కలుషిత ప్రపంచంలో మనల్ని రక్షించేది మందులు కాదు అని, మనల్ని కాపాడేది బలమైన, రసాయన రహిత పంటలే అన్నారు. కరోనా కల్లోల సమయంలో ప్రజలందరి నోట్లో నానిన మాట ఒక్కటే అది ‘‘ఇమ్యునిటి’’ ఇప్పుడు గోవు భుక్తి కొరకు అవసరం అయిందని విమలక్క అన్నారు.
ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత సేద్యమే మనల్ని భవిష్యత్తులో రాబోయే భయంకర రోగాల నుండి కాపాడుతుందన్నారు. రోగాలు తెచ్చుకున్నాక ఆసుపత్రుల వెంట పడేదానికంటే రోగాలను రాకుండ రోగ నిరోదక శక్తిని ఇచ్చేది సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార పదార్థాలేనని పేర్కొన్నారు. వరి నాట్ల కార్యక్రమం అనంతరం విజయానికి సూచకంగా వల్లె ప్రజలు బురదలో కబడ్డీ పోటీలు నిర్వహించారు.
కార్యక్రమంలో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు నరిసింహారెడ్డి, ప్రకృతి వ్యవసాయక మార్గదర్శి విజయరామ్, నరాల సుధాకర్, రాములు, ఉప సర్పంచ్ రాజేశ్వర్, రవిందర్ యాదవ్, ప్రసాద్, గంగారెడ్డి, గంగాధర్, ప్రదీప్, చిన్నయ్య, నర్సారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.