వేల్పూర్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయడం జరుగుతుందని, ఇంటి యజమాని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, మొక్కల్ని నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.