వేల్పూర్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వాడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంకం కిషన్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వరల్డ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వాడి గ్రామం వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారని కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పద్నాలుగు పదిహేను నెలల నుండి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సాంఘిక బహిష్కరణ చేసిన అంకం కిషన్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ ఎందుకు చేశారని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారని, సమస్య పరిష్కరించే విధంగా చేస్తామని వారు తెలిపారు.
అనంతరం అంకం కిషన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మండల జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల నిర్లక్ష్యం ఉందని ఇప్పటికైనా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దినేష్ కుమార్ ఆర్ స్టేటస్ చైర్మెన్ సంతోష్ రెడ్డి, వైస్ చైర్మన్ జంగారెడ్డి వింగ్ చైర్ పర్సన్ సంధ్యారెడ్డి, వైస్ పర్సన్ సమత యాదవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.