డిచ్పల్లి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి, మూడవ సెమిస్టర్స్ రెగ్యూలర్, ప్రాక్టికల్ పరీక్షలకు ఈ నెల 26 వ తేదీ వరకు ఫీజు గడువును నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. కావున ఎం.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.