నందిపేట్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ గొల్ల కుర్మ కులస్తులకు కమ్మునిటీ హాల్ కొరకు స్టలం కేటాయించాలని నియోజక వర్గ నాయకులు హైదరాబాద్ వెళ్లి ఎంఎల్ఏ, పియూసి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తానని హామి ఇవ్వడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. అందుకు నందిపేట్ గొల్ల కుర్మల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తొండకూర్ సర్పంచ్ కుర్మె దేవన్న, కె జి సురేష్, తొండకుర్ దేవన్న కె.జి.సురేష్, లక్కంపల్లి బోజన్న పేర్కొన్నారు.