డిచ్‌పల్లి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల సమాధాన పత్రాలకు రికౌంటింగ్, ఎ.పి.ఇ., పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల సమాధాన పత్రాలకు రివాల్యూయేషన్ ఈ నెల 23 వ తేదీ వరకు పీజు గడువును చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఒక్కో పేపర్‌కు రివాల్యూయేషన్ రూ. 500, ఒక్కో పేపర్‌కు రికౌంటింగ్ రూ. 300, రివ్యాల్యూయేషన్, రికౌంటింగ్ ఫారంకొరకు రూ. 25 చొప్పున ఫీజు నిర్ణయించారు. కావున పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించగలరని, పూర్తి వివరాల కోసం యూనివర్సిటి వెబ్ సైట్‌ను సంప్రదించగలరని పేర్కొన్నారు.