వేల్పూర్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆర్టిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేకుల రాములు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బురి ప్రతాప్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి నుండి వైద్య ఖర్చులకు గాను డబ్బులు ఇప్పించడం జరుగుతుందని అన్నారు. సీఎం సహాయనిధి నుండి ద్వారా గడ్డం మల్లేష్ 25000 రూపాయలు, మోహన్ 28000, పర్వీన్ బేగం 25000, సుదర్శన్ 50000, మోహన్ 18500, పద్మ. 17000 అందజేయడం జరిగిందని అన్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మాకు సీఎం సహాయనిధి నుండి డబ్బులు మంజూరు ఇప్పించినందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, అదే విధంగా స్థానిక టిఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.