కామారెడ్డి, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం టి.ఎన్.జి.ఓస్. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కాలెక్టరేట్‌లో వెహికిల్ పార్కింగ్, ప్రతి ఒక్క హాలులో వాష్ బేసిన్ పెట్టించాలని, బిల్డింగ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్, వాటర్ ప్రాబ్లమ్స్, నిజామాబాద్ నుండి కలెక్టరేట్ కామారెడ్డి వరకు ఉ. 10. గం.లకు. ఒక్కటి, 11. గం.లకు ఒక్కటి బస్సులు నడిపించాలని, కలెక్టరేట్ కామారెడ్డి నుండి నిజామాబాద్ వరకు సా. 5.30 గం.నిలకు ఒక్కటి, 6.00 గం. లకు ఒక్కటి బస్సులు నడిపించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్‌కు వినతి పత్రం సమర్పించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. సాయిలు, జాయింట్ సెక్రటరీ ఎమ్.సునీల్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రాజ్ కుమార్, శ్రీకాంత్, ఎల్లారెడ్డి, సంతోష్, మారుతి, మహిళ ఉద్యోగులు, తదితరులు హాజరయ్యారు.