వేల్పూర్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో శనివారం 4 వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభలో గుర్తించిన వంగిన, తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలను గుర్తించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాధ మోహన్ తెలిపారు.
గ్రామ సభలో మంత్రి ట్రాన్స్‌కో అధికారులు ఆదేశించడం జరిగిందని, గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలను, వంగిన స్తంబాల స్థానంలో కొత్తగ కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైన్‌మెన్ రామస్వామి, ప్రభాకర్, లైన్ ఇన్స్‌పెక్టర్ గంగాధర్, జూనియర్ లైన్ మెన్ చిరంజీవి, సాయినాథ్ పాల్గొన్నారు.