డిచ్‌పల్లి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు పరిశోధకులు చెప్యాల సంజీవ్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి చెప్యాల సంజీవ్ ‘‘ది ఎఫెక్ట్ ఆఫ్ మాక్రో ఎకనామిక్ వారియబుల్స్ ఆన్ ఫర్ఫామెన్స్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ విత్ రిఫరెన్స్ టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
శనివారం ఉదయం జరిగిన ఓపెన్ వైవా వోస్ (వర్చువల్) ఆన్ లైన్ వేదికకు ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి సిధో – కామ్హో బిర్స యూనివర్సిటీలోని కామర్స్ విభాగాధిపతి డా. ప్రదీప్త బెనర్జీ హాజరై పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ డీన్ ఆచార్య ఎం. యాదగిరి చైర్మన్‌గా, బిఓఎస్ డా. వాణి కన్వీనర్‌గా వ్యవహరించారు.
విభాగాధిపతి డా. రాజేశ్వరి, అధ్యాపకులు ఆచార్య కైసర్ మహ్మద్, డా. ఆంజనేయులు, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్యాల సంజీవ్ పిహెచ్. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్, కంట్రోలర్ డా. పాత నాగరాజు, పి ఆర్ ఓ డా. వంగరి త్రివేణి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.