వేల్పూర్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు రకమైన పద్ధతులు, అవలంబిచ్చినట్లయితే నూతన వ్యవసాయ పద్ధతులతో మేలురకమైన వంగడాలు, ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వేల్పూర్ వ్యసాయ శాఖ అధికారి నర్సయ్య తెలిపారు.
శనివారం వేల్పూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య వ్యవసాయ క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రైతులకు పలు సూచనలు చేశారు. పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు 2 నుండి 3 ఇంచుల నీరు ఉన్నప్పుడు మాత్రమే వరి నాట్లు వేసుకోవాలని అధికంగా ఉంటే నాట్లు యొక్క కర్ర నీటలో మునిగిఉండడం, నీరు ఎక్కువ ఉండడంచేత నల్లబడి మురిగి కుల్లి పోతుందన్నారు.
ఈ సమయంలో ఎరువులు 12::32::16 కానీ డీఏపీ, ఫొటాష్ కలిపి చల్లుకోవడం వల్ల పంట మంచిగా నాటుకుంటుందన్నారు. సోయా పంటకు 19:19:19 మందులు ఎకరాకు 500 గ్రాములు ఒక ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. మొక్కజొన్న పంటకు 10 నుంచి 15 కిలోల యూరియా, ఫొటాష్ ఉపయోగించాలని తెలిపారు..